ఇది పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఒక ఆహర్మోను, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇన్సులిన్ లేకపోతే మన శరీరం గ్లూకోజ్ ని శక్తిగా ఉపయోగించుకోలేదు. మీకు మదుమేహం ఉంటే, మీ శరీరం ఇన్సులిన్ ను తయారు చేయలేదు, లేదా తయారయ్యే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు మీకు అదనంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది. మీకు అవసరమైన ఇన్సులిన్ ను శరీరంలోకి ఇంజెక్షన్ల రూపంలో ఇన్సులిన్ పెన్, సిరెంజ్ లేదా ఇన్సులిన్ పైప్ తో తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకుంటే: చక్కె స్థాయిలను నియంత్రిస్తాయి మీకు శక్తిని ఇస్తాయి ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి
మనం ఉపవాసం ఉన్నప్పుడు విడులయ్యే ఇన్సులిన్ ను బసల్ ఇన్సులిన్ అంటారు. భోజనం తిన్న తర్వాత రక్తంలో పెరిగే చక్కెర నిల్వలకు అనుగుణంగా ఇన్సులిన్ స్రవించడం ఎక్కువ అవుతుంది. మదుమేహ రోగుల్లో ఈ ప్రక్రియ ప్రభావితం అవుతుంది, అందుకే వారు బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది.
హైపోగ్లైసీమా అనేది అసాధారణమైన రీతిలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయి తగ్గిపోవడం వల్ల ఏర్పడే పరిస్థితి, సాధారణంగా 70 ఎంజి/డిఎల్ గా ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే: అధికంగా వ్యాయామం చేయడం తగినంత తినకపోవడం భోజనం మానేయడం మందులు ఎక్కువగా తీసుకోవడం ఏదిఏమైనా, మీ వ్యక్తిగత బ్లడ్ గ్లూకోజ్ లక్ష్యాలు, అవి ఎప్పుడూ మీకు బాగా తక్కువగా ఉంటాయన్న విషయాలు మీ డాక్టర్ తో మాట్లాడటం చాలా ముఖ్యం.
మీ బ్లడ్ సుగర్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు మొదటగా, వేగంగా పనిచేసే కార్బొహేడ్రేట్స్ ను 15 గ్రాములు తినాలి లేదా తాగాలి అవి: మూడు లేక నాలుగు గ్లూకోజ్ మాత్రలు ఒక ట్యూబ్ గ్లూకోజ్ జెల్ ఆరు నుంచి నాలుగు గట్టి క్యాండీలు (సుగర్ ఫ్రీ కానివి) ½ కప్పు పండ్ల రసం 1 కప్పు వెన్నతీసిన పాలు ½ కప్పు సాఫ్ట్ డ్రింక్ (సుగర్ ఫ్రీ కానివి)
వణుకు చెమటపట్టడం కళ్లుతిరగడం ఆకలి గుండె వేగంగా కొట్టుకోవడం చూపు మందగించడం తలపోటు నీరసం లేదా అలసట ఒకవేళ మీకు లో బ్లడ్ సుగర్ సమస్య ఉంటే, వెంటనే త్వరగా పనిచేసే తియ్యటి ఆహారాన్ని 15 గ్రాములు మేర వెంటనే తీసుకోవాలి, అవి; ½ క్యాన్ సాదారణ సోడా( డైట్ కాదు) 1 టేబుల్ స్పూన్ల పంచదార లేదా పెద్ద స్పటికాల్లాంటివైతే రెండు 3 గట్టి క్యాండీలను వేగంగా తినాలి
నక్టర్నల్ హైపోగ్లైసీమియా లేదా రాత్రిపూట హైపో అనేది మదుమేహానికి ఇన్సులిన్ సుకునేవారిలో సాధారణంగా వస్తుంది. ఈ హైపో కారణంగా మెళకు వచ్చినప్పుడే లక్షణాలు గుర్తించగలరు. దీని స్వభావాన్ని బట్టి, రాత్రి పూట ఈ హైపో కారణంగా మెళకువ వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని గుర్తిస్తారు. కాబట్టి చాలా మందికి తమకు రాత్రిపూట వచ్చే హైపో ఉందన్న విషయం తెలియదు, మీకు నక్టర్నల్ హైపోగ్లైసీమియా ఉంటే దానిని గుర్తించడం చాలా అవసరం. ఈ నక్టర్నల్ హైపోగ్లైసీమియా ఇన్సులిన్ తీసుకునేవారిలో సాధరణమే, మదుమేహానికి నోటి ద్వారా ఆహారం తీసుకునేవారిలో కూడి ఇది వచ్చే అవకాశం ఉంది.
నక్టర్నల్ హైపోగ్లైసీమీయా ఉన్నప్పుడు మీకు బాగా నీరసంగా అనిపించొచ్చు. ఏదిఏమైనా, ఒకవేళ మీకు అలా లేకపోతే, ఈ క్రింద ఇవ్వబడిన హైపర్ గ్లైసీమియా లక్షణాలు ఒకటి , రెండు నిద్రలో కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి నిద్రపట్టకపోవడం స్పష్టమైన కలలు లేదా పీడకలలురావటం ఉదయం పూట తలపోటు రాత్రిపూట చెమటపట్టడం మూడ్ మారిపోవడం ఆలసట మూర్ఛ
పిల్లలకు నాక్టర్నల్ హైపోగ్లైసీమిమా ఉంటే తల్లిదండ్రలు అందోళన చెందాల్సిందే. మదుమేహం ఉన్న పిల్లల, తల్లిదండ్రులు.. రాత్రి పూట పడుకున్న తర్వాత హైపోగ్లైసీమియా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమోనని గమనిస్తూ ఉండాలి.
మీ చర్మం కింద ఉండే కొవ్వు భాగాల్లోకి ఇన్సులిన్ ను ఇంజెక్ట్ చేసుకుంటే అది బాగా పని చేస్తుంది మీరు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు: ఇన్సులిన్ ఎలా సిద్ధం చేసుకోవాలి ఇన్సులిన్ ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలి ఇంజెక్షన్ చేసుకునే ప్రాంతం ఎలా మార్చుకోవాలి
ఇన్సులిన్ ను మీ శరీరంలోకి చేర్చడానికి వేరు వేరు పరికరాలు ఉన్నాయి; సిరెంజులు, ఇన్సులిన్ పెన్, ఇన్సులిన్ పంప్, ఐ-పోర్ట్ వంటివి ఇన్సులిన్ ను లోపలికి పంపించే వేరు వేరు ఆప్షన్లు. సిరెంజ్- ఇన్సులిన్ సిరెంజ్ లు సాధారణ వాటికంటే భిన్నంగా ఉంటాయి. అవి బాగా సన్నగా ఉంటాయి, వాటి సూదులు దాదాపు నొప్పి కలిగించవు, తొలగించుకునే నీడిల్ గార్డ్ తో ఇవి లభిస్తున్నాయి. సిరెంజి బయట వైపు ఇవ్వబడిన గీతల మార్కు సాయంతో మీరు తగినంత ఇన్సులిన్ ను బయటకు తీసుకోవచ్చు. పెన్- ఇది ఇన్సులిన్ క్యాటర్జెడ్ కూర్పులా ఉంటుంది( కలిపి లేదా విడిడా కొనుక్కోవచ్చు) ఒక డైల్ డోస్ ను లెక్కిస్తుంది, డిస్పోజబుల్ పెన్ నీడిల్ సాయంతో డోస్ ను ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ పెన్ లో, ఇన్సులిన్ సిరెంజ్ కంటే ప్రత్యేకమైన అనూలతలు ఉన్నాయి : ఉపయోగించడం తేలిక కచితత్వం
చేతులను వేడి, సబ్బునీళ్లతో కడుక్కోవాలి మసకగా ఉన్న ఇన్సులిన్ ఉపయోగిస్తుంటే, బాటిల్ ను చేతుల మధ్య దొర్లించాలి(కుదప కూడదు) ఇన్సులిన్ బాటిల్ రబ్బరు మూతను ఆల్కహాల్ తో శుభ్రం చేయాలి. మీరు తీసుకునే యూనిట్లకు సమానమైన గాలితో సిరెంజ్ ను నింపాలి. సూదిని బాటిల్ లోకి గుచ్చి, గాలిని ఇన్సులిన్ బాటిల్ లోకి పంపాలి. సిరెంజ్ ను తిప్పి బాటిల్ ను తల్లకిందులుగా చేసి మీ ఇన్సులిన్ డోన్ ను తీసుకోవాలి. సూదిని చర్మంలో గుచ్చాలి సిరెంజ్ చివర్లో ఉన్న ప్లంగర్ ను నొక్కి డోన్ ను శరీరంలోకి పంపించాలి
ఒక కొత్త పెన్ నీడిల్ ను బిగించాలి లేదా నొక్కాలి. ఒకవేళ అవసరమైతే, నీడిల్ సాయంతో పెన్ లోని గాలి తీసివేయాలి పెన్ చివర్లో ఉన్న నాబ్ (లేదా డయల్) ను అవసరమైన యూనిట్లకు తగినట్టుగా తిప్పాలి సూదిని శరీరంలో గుచ్చుకోవాలి పెన్ చివర్లో ఉన్న బటన్ నొక్కడం ద్వారా డోన్ ను విడుదల చేయాలి తీసుకునే డోన్ ను బట్టి ఐదు లేక పది లెక్కించాలి ఉపయోగించిన సూదిని తీసి పారేయాలి సిరెంజ్, పెన్ ఉపయోగించి ఇన్సులిన్ తీసుకొనేటప్పుడు ఉపయోగపడే చిట్కాలు: పొట్టి సూదులు అయితే, ఇంజెక్షన్ లో అసౌకర్యం తక్కువగా ఉంటుంది. అయితే ఇంజెక్షన్ లోతు అనేది ఎంత త్వరగా ఇన్సులిన్ తీసుకుంటుందన్న విషయం మీద ప్రభావం చూపుతుంది. సిరెంజ్ సైజు సమన్వయం (ఉదా. 1 సిసి, 1/2సిసి, 3/10 సిసి) ఇన్సులిన్ డోస్ కు సరిపోయేలా చూసుకోవాలి. సిరెంజ్/పెన్ సూదిని తిరిగి ఉపయోగించకూడదు. సిరెంజ్ ఇతరులతో పంచుకోకూడదు.. ఉపయోగించిన సిరెంజ్ /పెన్ సూదుల్ని సక్రమంగా డిస్పోజ్ చేయాలి
మీరు ఇన్సులిన్ ను శరీరంలోని కొవ్వుతో ఉన్న భాగాల చర్మం కింద ఇంజెక్ట్ చేసుకుంటే అది బాగా పనిచేస్తుంది. ఈ క్రింది భాగాలలో ఇన్సులిన్ ఇంజెక్టు చేసుకోవాలి మోచేతి పైభాగంలో వెనుక వైపు పొట్ట (బొడ్డు సమీపంలో) తొడల ముందు భాగం నడుం వెనుక భాగం వెనుక చివర్ల(పిరుదులు) గత కొద్ది రోజుల ఇంజెక్షన్ తీసుకుంటున్న ప్రాంతానికి 1 అంగుళం దూరంగా ఇంజెక్షన్లు తీసుకోవాలి. బొడ్డు లేదా ఏవైనా మచ్చలకు 2 అంగుళాల దూరంలో ఇంజెక్షన్ తీసుకోవాలి. చర్మం కొట్టుకుపోయినా, చీరుకుపోయిన ప్రాంతం; వాచిన లేదా పట్టుకుంటే గట్టిగా ఉండే ప్రాంతాల్లో చేయకూడదు. ఇంజెక్షన్ కి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు గమనించాల్సిన విషయాలు ఇంజెక్షన్ చేసుకునే ప్రాంతాలను మార్చడం ద్వారా లైపోడైస్ట్రోపీ, ఒకే చోట ఇంజెక్ట్ చేయడం వల్ల చర్మం కింద కొవ్వు ముద్దులు ఏర్పడటం తగ్గిపోతుంది. ఇంజెక్షన్ ప్రాంతాన్ని సరిగ్గా మార్చేందుకు అనుసరించాల్సిన నిబంధనలు ప్రతి రోజు కూడా ఒకే సాధారణ ప్రాంతంలో, ఒకే సమయంలో తీసుకోవాలి ప్రతి రోజు ఇంజెక్షన్ ఇచ్చే చోటును మార్చాలి ఇంజెక్షన్ ఇంచే కోణం, చర్మం మడతపెట్టడం చాలా మంది చర్మాన్ని కాస్త మడతపెట్టి, దానికిలోకి 90 డిగ్రీల కోణంలో సూదిరి గుచ్చారు. మీ చర్మాన్ని సరిగ్గా మడతపెట్టడానికి, ఈ క్రింది దశల్ని అనుసరించాలి: చర్మాన్ని మీ బొటనవేలు, చూపుడు వేలు మధ్య రెండు అంగుళాల చర్మాన్ని పిండి పట్టకోవాలి, క్రిందివైపు ఉండే కండరాల్లో ఉండే కొవ్వు నుంచి చర్మాన్ని బయటకు లాగాలి (ఒకవేళ మీరు 4 లేదా 5 మిల్లి మీటర్ల పెన్ నీడిల్ ఉపయోగిస్తుంటే.) సూది గుచ్చడం. కొద్దిగానే పట్టుకోవడం వల్ల సూది కండరాల్లోకి వెళ్లదు. ప్లంగర్ (ఒకవేళ మీరు పెన్ ఉపయోగిస్తుంటే బటన్) నొక్కడం వల్ల ఇన్సులిన్ ఇంజెక్ట్ అవుతుంది. చర్మాన్ని మడత పెట్టిన చోట పట్టు వదలేయాలి. చర్మం నుంచి సూది బయటకు తీయాలి. పర్యవేక్షణ