మదుమేహం అంటే మన రక్తంలో అధిక మోతాదులో చక్కెర నిల్వలు ఉండటమే. ఇన్సులిన్ అని పిలవబడే రసాయనం లేదా హార్మోన్ ను మన శరీరం తగినంత మోతాదులో ఉత్పత్తి చేయకపోతే అధిక చక్కెర సమస్య తలెత్తుతుంది. మీరు తినే ఆహారంలో అధిక భాగాన్ని శరీరం ఒక విధమైన చక్కెరగా మారుస్తుంది, దానిని గ్లుకోజ్ అంటారు. ఈ చక్కెర మన శరీరంలోని అన్ని కణాలకు రక్తం ద్వారా ప్రయాణిస్తుంది. మీకు శక్తి కావాలంటే శరీర కణాలకు ఈ చక్కెర అవసరం. రక్తంలోని చక్కెర, శరీర కణాల్లోకి వెళ్లడానికి ఇన్సులిన్ సాయపడుతుంది. ఇన్సులిన్ లేకపోతే, మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచడానికి మీ శరీర కణాలు చక్కెరను పొందలేవు. రక్తంలోని చక్కెర ను శరీర కణాల్లోకి పంపించడం ద్వారా ఇన్సులిన్, రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో(మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు) ఉంచడానికి సాయపడుతుంది. మీ రక్తంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గించడానికి తగినంత ఇన్సులిన్ లేకపోతే మీకు మదుమేహం ఉన్నట్టు. రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మదుమేహానికి చికిత్స ఉంది, తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.
మీ శరీరం ఇన్సులిన్ ను ఏమాత్రం తయారు చేసుకోలేనప్పుడు మీ శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేసుకోలేనప్పుడు, లేదా శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు. రక్తంలోని చక్కెరను, శరీర కణాల్లోకి పంపించేందుకు తగినంత ఇన్సులిన్ లేనప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది.
ఈ టైప్ 1 మదుమేహంలో, శరీరం ఇన్సులిన్ ను తయారు చేసుకోలేకపోతుంది. టైప్ 1 మదుమేహం ఎక్కువగా చిన్న పిల్లల్లో, యుక్త వయస్సు వారిలో కనిపిస్తుంది, పెద్దవాళ్లతో పోల్చితే వీరిలోనే ఎక్కువ. టైప్ 1 మదుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడానికి తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాలి.
గ్లూకోజ్(మనం తిన్న ఆహారం నుంచి ఉత్పత్తి అయ్యేది)ను మన రక్త ప్రవాహం నుంచి శరీర కణాల్లోకి పంపించడానికి తప్పనిసరైన హార్మోను ఇస్సులిన్, ఇక్కడ దీనిని శక్తి కోసం ఉపయోగిస్తారు. తగినంత ఇన్సులిన్ లేకపోతే, గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోతుంది, దీనివల్ల తీవ్రమన ఆరోగ్య సమ్యలు తలెత్తుతాయి.
ఇది పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఒక ఆహర్మోను, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇన్సులిన్ లేకపోతే మన శరీరం గ్లూకోజ్ ని శక్తిగా ఉపయోగించుకోలేదు. మీకు మదుమేహం ఉంటే, మీ శరీరం ఇన్సులిన్ ను తయారు చేయలేదు, లేదా తయారయ్యే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు మీకు అదనంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది. మీకు అవసరమైన ఇన్సులిన్ ను శరీరంలోకి ఇంజెక్షన్ల రూపంలో ఇన్సులిన్ పెన్, సిరెంజ్ లేదా ఇన్సులిన్ పైప్ తో తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకుంటే: చక్కె స్థాయిలను నియంత్రిస్తాయి మీకు శక్తిని ఇస్తాయి ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి
మనం ఉపవాసం ఉన్నప్పుడు విడులయ్యే ఇన్సులిన్ ను బసల్ ఇన్సులిన్ అంటారు. భోజనం తిన్న తర్వాత రక్తంలో పెరిగే చక్కెర నిల్వలకు అనుగుణంగా ఇన్సులిన్ స్రవించడం ఎక్కువ అవుతుంది. మదుమేహ రోగుల్లో ఈ ప్రక్రియ ప్రభావితం అవుతుంది, అందుకే వారు బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది.
మీ చర్మం కింద ఉండే కొవ్వు భాగాల్లోకి ఇన్సులిన్ ను ఇంజెక్ట్ చేసుకుంటే అది బాగా పని చేస్తుంది మీరు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు: ఇన్సులిన్ ఎలా సిద్ధం చేసుకోవాలి ఇన్సులిన్ ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలి ఇంజెక్షన్ చేసుకునే ప్రాంతం ఎలా మార్చుకోవాలి
ఇన్సులిన్ ను మీ శరీరంలోకి చేర్చడానికి వేరు వేరు పరికరాలు ఉన్నాయి; సిరెంజులు, ఇన్సులిన్ పెన్, ఇన్సులిన్ పంప్, ఐ-పోర్ట్ వంటివి ఇన్సులిన్ ను లోపలికి పంపించే వేరు వేరు ఆప్షన్లు.
ఇన్సులిన్ సిరెంజ్ లు సాధారణ వాటికంటే భిన్నంగా ఉంటాయి. అవి బాగా సన్నగా ఉంటాయి, వాటి సూదులు దాదాపు నొప్పి కలిగించవు, తొలగించుకునే నీడిల్ గార్డ్ తో ఇవి లభిస్తున్నాయి. సిరెంజి బయట వైపు ఇవ్వబడిన గీతల మార్కు సాయంతో మీరు తగినంత ఇన్సులిన్ ను బయటకు తీసుకోవచ్చు.
ఇది ఇన్సులిన్ క్యాటర్జెడ్ కూర్పులా ఉంటుంది( కలిపి లేదా విడిడా కొనుక్కోవచ్చు) ఒక డైల్ డోస్ ను లెక్కిస్తుంది, డిస్పోజబుల్ పెన్ నీడిల్ సాయంతో డోస్ ను ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ పెన్ లో, ఇన్సులిన్ సిరెంజ్ కంటే ప్రత్యేకమైన అనూలతలు ఉన్నాయి : ఉపయోగించడం తేలిక కచితత్వం
చేతులను వేడి, సబ్బునీళ్లతో కడుక్కోవాలి మసకగా ఉన్న ఇన్సులిన్ ఉపయోగిస్తుంటే, బాటిల్ ను చేతుల మధ్య దొర్లించాలి(కుదప కూడదు) ఇన్సులిన్ బాటిల్ రబ్బరు మూతను ఆల్కహాల్ తో శుభ్రం చేయాలి. మీరు తీసుకునే యూనిట్లకు సమానమైన గాలితో సిరెంజ్ ను నింపాలి. సూదిని బాటిల్ లోకి గుచ్చి, గాలిని ఇన్సులిన్ బాటిల్ లోకి పంపాలి. సిరెంజ్ ను తిప్పి బాటిల్ ను తల్లకిందులుగా చేసి మీ ఇన్సులిన్ డోన్ ను తీసుకోవాలి. సూదిని చర్మంలో గుచ్చాలి సిరెంజ్ చివర్లో ఉన్న ప్లంగర్ ను నొక్కి డోన్ ను శరీరంలోకి పంపించాలి
ఒక కొత్త పెన్ నీడిల్ ను బిగించాలి లేదా నొక్కాలి. ఒకవేళ అవసరమైతే, నీడిల్ సాయంతో పెన్ లోని గాలి తీసివేయాలి పెన్ చివర్లో ఉన్న నాబ్ (లేదా డయల్) ను అవసరమైన యూనిట్లకు తగినట్టుగా తిప్పాలి సూదిని శరీరంలో గుచ్చుకోవాలి పెన్ చివర్లో ఉన్న బటన్ నొక్కడం ద్వారా డోన్ ను విడుదల చేయాలి తీసుకునే డోన్ ను బట్టి ఐదు లేక పది లెక్కించాలి ఉపయోగించిన సూదిని తీసి పారేయాలి
పొట్టి సూదులు అయితే, ఇంజెక్షన్ లో అసౌకర్యం తక్కువగా ఉంటుంది. అయితే ఇంజెక్షన్ లోతు అనేది ఎంత త్వరగా ఇన్సులిన్ తీసుకుంటుందన్న విషయం మీద ప్రభావం చూపుతుంది. సిరెంజ్ సైజు సమన్వయం (ఉదా. 1 సిసి, 1/2సిసి, 3/10 సిసి) ఇన్సులిన్ డోస్ కు సరిపోయేలా చూసుకోవాలి. సిరెంజ్/పెన్ సూదిని తిరిగి ఉపయోగించకూడదు. సిరెంజ్ ఇతరులతో పంచుకోకూడదు.. ఉపయోగించిన సిరెంజ్ /పెన్ సూదుల్ని సక్రమంగా డిస్పోజ్ చేయాలి
మీరు ఇన్సులిన్ ను శరీరంలోని కొవ్వుతో ఉన్న భాగాల చర్మం కింద ఇంజెక్ట్ చేసుకుంటే అది బాగా పనిచేస్తుంది.
మోచేతి పైభాగంలో వెనుక వైపు పొట్ట (బొడ్డు సమీపంలో) తొడల ముందు భాగం నడుం వెనుక భాగం వెనుక చివర్ల(పిరుదులు) గత కొద్ది రోజుల ఇంజెక్షన్ తీసుకుంటున్న ప్రాంతానికి 1 అంగుళం దూరంగా ఇంజెక్షన్లు తీసుకోవాలి. బొడ్డు లేదా ఏవైనా మచ్చలకు 2 అంగుళాల దూరంలో ఇంజెక్షన్ తీసుకోవాలి. చర్మం కొట్టుకుపోయినా, చీరుకుపోయిన ప్రాంతం; వాచిన లేదా పట్టుకుంటే గట్టిగా ఉండే ప్రాంతాల్లో చేయకూడదు.
ఇంజెక్షన్ చేసుకునే ప్రాంతాలను మార్చడం ద్వారా లైపోడైస్ట్రోపీ, ఒకే చోట ఇంజెక్ట్ చేయడం వల్ల చర్మం కింద కొవ్వు ముద్దులు ఏర్పడటం తగ్గిపోతుంది. ఇంజెక్షన్ ప్రాంతాన్ని సరిగ్గా మార్చేందుకు అనుసరించాల్సిన నిబంధనలు ప్రతి రోజు కూడా ఒకే సాధారణ ప్రాంతంలో, ఒకే సమయంలో తీసుకోవాలి ప్రతి రోజు ఇంజెక్షన్ ఇచ్చే చోటును మార్చాలి
చాలా మంది చర్మాన్ని కాస్త మడతపెట్టి, దానికిలోకి 90 డిగ్రీల కోణంలో సూదిరి గుచ్చారు. మీ చర్మాన్ని సరిగ్గా మడతపెట్టడానికి, ఈ క్రింది దశల్ని అనుసరించాలి: చర్మాన్ని మీ బొటనవేలు, చూపుడు వేలు మధ్య రెండు అంగుళాల చర్మాన్ని పిండి పట్టకోవాలి, క్రిందివైపు ఉండే కండరాల్లో ఉండే కొవ్వు నుంచి చర్మాన్ని బయటకు లాగాలి (ఒకవేళ మీరు 4 లేదా 5 మిల్లి మీటర్ల పెన్ నీడిల్ ఉపయోగిస్తుంటే.) సూది గుచ్చడం. కొద్దిగానే పట్టుకోవడం వల్ల సూది కండరాల్లోకి వెళ్లదు. ప్లంగర్ (ఒకవేళ మీరు పెన్ ఉపయోగిస్తుంటే బటన్) నొక్కడం వల్ల ఇన్సులిన్ ఇంజెక్ట్ అవుతుంది. చర్మాన్ని మడత పెట్టిన చోట పట్టు వదలేయాలి. చర్మం నుంచి సూది బయటకు తీయాలి.